సీసీ రోడ్లకు.. రూ.3 కోట్ల 35 లక్షలు

  • ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
  • పనుల్లో జాప్యం వహించకుండ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
కొండాపూర్ డివిజన్ పరిధిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ A బ్లాక్, మార్తాండ్ నగర్, రాజరాజేశ్వరి కాలనీ, సిద్దిక్ నగర్, పత్రిక నగర్ కాలనీలలో రూ.3 కోట్ల 35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని , అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానన్నారు. ప్రేమ్ నగర్ A బ్లాక్ కాలనీ లో రూ.50.00 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, మార్తాండ్ నగర్ లో రూ. 1 కోటి 15 లక్షలు, రాజరాజేశ్వరి కాలనీలో రూ.45 లక్షలతో, సిద్దిక్ నగర్ లో రూ.80 లక్షలతో, పత్రిక నగర్ కాలనీ లో రూ .45 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, డివిజన్ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, పేరుక రమేష్ పటేల్, బలరాం యాదవ్, తిరుపతి రెడ్డి, గఫుర్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రజినీకాంత్, రూపరెడ్డి, తిరుపతి యాదవ్, భాస్కర్ రెడ్డి, సుద్దపల్లి విజయకృష్ణ, బసవరాజు, వెంకటి, సాగర్ చౌదరి, గణపతి, నందు, చారీ, జాఫర్, హిమామ్, ఉస్మాన్, జలీల్, అమీనుద్దీన్, సాయి శామ్యూల్ కుమార్, పాషా భాయ్, ఈరమ్మ, సబెరా, చాంద్ బీ, జాహిర్ ఖాజీ, వహిద్ అలీ, లక్ష్మి, శైలజ, కలీం, షబ్బీర్ అలీ, శ్రీనివాస్, ముక్తార్, మొహ్మద్ అలీ, సలీం పటేల్, విజయ్, పూజ, ప్రెసిడెంట్ వెంకటి, సంజీవ, అహ్మద్, ముక్తార్, కలీం, రవీందర్ రెడ్డి, శర్మ, కచ్చావా దీపక్, అభి అక్షయ్, సిద్దు, కాశెట్టి అంజి, కూన శ్రీనివాస్, జహంగీర్ కాలనీ వాసులు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని సన్మానించిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here