అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్ గాంధీ

  • సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ కాలనీ, నేతాజీ నగర్, గోపన్ పల్లి విలేజ్, టి ఎన్జీఓ ఎస్ కాలనీ, నానక్ రాం గూడ , లోథాబస్తీ, గోరెంక బస్తీ కాలనీలలో రూ. 2 కోట్ల 98 లక్షల అంచనావ్యయంతో చెపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అనంతరం శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు.

గుల్మోహర్ కా లనీలో రూ. 30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, నేతాజీ నగర్ కాలనీలో రూ. 30 లక్షలతో, గోపన్ పల్లి విలేజ్ లో రూ. 30 లక్షలతో, టి ఎన్జీఓ ఎస్ కాలనీలో రూ.1 కోటితో , నానక్ రాంగుడా, లోథాబస్తీ కాలనీలలో రూ.68 లక్షలతో, రాయదుర్గంలోని గోరెంక బస్తీ కాలనీలో రూ.1 కోటి అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here