చేనేత హస్తకళా ఉత్పత్తులకు విశేష ఆదరణ.. ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్ లో చేనేత హస్తకళా ఉత్పత్తులు విశేష ఆదరణ చురగొంటున్నాయి.

వీటిని మహిళలు అధిక సంఖ్య లో కొనుగోలు చేస్తున్నారు. చేనేత చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చెప్పులు, చెక్క బొమ్మలు, పప్పెట్ బొమ్మలు, రెడీమేడ్ కుచ్ వర్క్ బ్లౌజ్ లు , బేడీషీట్స్, పూసలు అద్దాలు జ్యువలరీ మరెన్నో ఆకట్టుకుంటున్నవి.

ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జంట. యోగిని కార్నోర్కర్ శిష్య బృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేష్ వందన, రామ శ్లోక, కృష్ణ రాస్, క్రిష్ వందన, తరణ , రాధా కృష్ణ హోరి, కృష్ణ భజన, గర్భ నృత్యం మొదలైన అంశాలను ప్రదర్శించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here