- కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీ, పాన్ మక్త కాలనీల్లో రూ.73 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొండాపూర్ డివిజన్ లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోశంగా ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
- శంకుస్థాపన, మంజూరైన అభివృధి పనుల వివరాలు..
- 1.కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీలో రూ. 50 లక్షల అంచనావ్యయంతో సీసీ రోడ్డు పనులు
- 2. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పాన్ మక్త లో రూ.23 లక్షల అంచనావ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, తెరాస నాయకులు జంగం గౌడ్,శ్రీనివాస్ చౌదరీ,తిరుపతి, రజినీకాంత్, తిరుపతి యాదవ్, దశరథ్, సమ్మద్, హనీఫ్, జాఫర్, తోట సురేష్ తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.