- రూ. 5కే పేదవాడికి నాణ్యమైన భోజనం ప్రారంభిస్తున్న : ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : హఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదినగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన రూ. 5 భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ ను కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్ GHMC అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి రూ. 5కే చక్కటి భోజనం అందిస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని హఫీజ్ పేట్, మదినగూడ చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు, జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ‘అన్నపూర్ణ’ క్యాంటీన్లు లాక్‌డౌన్ సమయంలో కూడా నిత్యం పేదల కడుపు నింపాయన్నారు. కార్యక్రమంలో GHMC అధికారులు DE స్రవంతి, AE ప్రతాప్, AMOH కార్తిక్, SRP మహేష్, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, దొంతి శేఖర్, కృష్ణ ముదిరాజు, మిద్దెల మల్లారెడ్డి, సంగారెడ్డి, జనార్దన్, బాబు మోహన్ మల్లేష్, పద్మారావు, జమీర్, వెంకటేశ్వర్ రావు, సుదేష్, సబీర్, దామోదర్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.