నమస్తే శేరిలింగంపల్లి: సీసీ రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని డీకే ఎంక్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు” అండర్ గ్రౌండ్ డ్రైనేజీ” నిర్మాణ పనులను స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. డీకే ఎంక్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిర్మాణ పనులను పరిశీలించానని, కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్రపు గంగాధర్ రావు, విజయ్, రాంబాబు, అనిల్ రాయ్, విశ్వనాధ్ , రామారావు, హరి బాబు, సుబ్బారావు, ఏస్ అర్ పి. కనకరాజు, లింగయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ రఘు పాల్గొన్నారు.