శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. అయితే స్థానిక కాలనీవాసుల సౌలభ్యం కోసం.. నూతనంగా వేస్తున్న సిసి రోడ్డు వెడల్పు కోసం ఇరువైపులా ఉన్న ర్యాంపులను, అరుగులను తొలగించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు ప్రాధాన్యత క్రమంలో కాలనీలో వారిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీసీ రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, కలివేముల వీరేశం గౌడ్, నరసింహ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్, రాజ్ కుమార్, దివాకర్ రెడ్డి, గాఫర్, శ్రీనివాస్, మల్లేష్, గౌతమ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శేఖర్, సాయి, శ్యామ్, కిరణ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

గోపినగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here