మహిళల సాధికారత కోసం కృషి : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • చందానగర్ క్రిస్టల్ గార్డెన్ లో ఘనంగా మహిళా దినోత్సవం
  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న డీకే అరుణ, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ ఈశ్వర్ రెడ్డి, నైనా జైస్వాల్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ క్రిస్టల్ గార్డెన్ లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సహకారంతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా డీకే అరుణ, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ ఈశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా రెడ్డి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీకే అరుణ, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ ఈశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా రెడ్డి, సైనా జస్వాల్, డాక్టర్ ప్రజ్ఞ, శ్యామల, మాధవి మొదలగు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆడపిల్లలమని దిగులు చెందద్దు ఆడ పులిలా ఈ లోకానికి మీరెంటో నిరూపించుకోవాలని చెప్పారు.

డీకే అరుణ ను సత్కరిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

సమాజంలో మీరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ దేవి, పి.టి ఉషా లాంటి గొప్ప గొప్ప వారి స్ఫూర్తి తో మీరు ఎ కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు పోవాలి.. విజయం సాధించాలని అన్నారు. మహిళల సాధికారత కోసం నేనెప్పుడూ ముందుటానని తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ ఆడవాళ్ళు తలచుకుంటే ఏమైనా సాధించగలరనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

మహిళా దినోత్సవం ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న డీకే అరుణ, రవికుమార్ యాదవ్, నైనా జైస్వల్

కేసిఆర్, కే.టి.ఆర్ మాయ మాటలు నమ్మొద్దని, మీ ఇంటికి వచ్చిన బి.ఆర్.ఎస్ నాయకులను అడగండి .. దిశా చట్టం ఏమైందని , షి టీమ్స్ ఏమైపోయాయని అడగాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు అధ్యక్షురాలు, జిల్లా నాయకులు శేరిలింగంపల్లి నియోజకవర్గం మహిళలు పాల్గొన్నారు. నవత రెడ్డి కన్వీనర్ పద్మ, సింధు రెడ్డి, రేణుక , అరుణ మహేశ్వరి, లలితారెడ్డి, లలిత , అనిత మమత కృష్ణప్రియ ఇందిరా వరలక్ష్మి పాల్గొన్నారు.

పాల్గొన్న మహిళామణులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here