- సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీనివాస ఆనందం అపార్ట్ మెంట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. స్థానికవాసులు కాలనీలోని సమస్యలను కార్పొరేటర్ కి విన్నవించగా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలను సత్వరమే చర్యలు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో ఫోన్ లో స్వయంగా చర్చించి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు వేసే సమయంలో స్థానిక వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. రైన్ వాటర్ రోడ్ల పై నిల్వకుండా డ్రైనేజీ లో కలిసే విధంగా తగు చర్యలు తీసుకుని క్రమబద్ధీకరణ చేయిస్తానని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కృష్ణ రెడ్డి, శ్రీనివాస ఆనంద అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ మల్లేష్, జనరల్ సెక్రటరీ ప్రీతం, ట్రెజరర్ నిశాంత్, రెసిడెంట్స్ శ్రీలక్ష్మి, మీర, ప్రతాప్ రెడ్డి, కె పి రావు పాల్గొన్నారు.