- మోహర్ కాలనీ పార్క్ లో ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంట్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ పార్క్ లో హెచ్ ఎస్ బీసీ ఇండియా, ద సోషల్ ల్యాబ్, యూనైటెడ్ వే ముంబై సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంట్ (మంచినీటి శుద్ధి కేంద్రం) ను కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, కాలనీవాసులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గుల్ మోహర్ పార్క్ కాలనీ వాసులు ఎంతో వినూత్నంగా ఆలోచించి అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ ఇతర ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచిందని, పార్క్ లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణంలో నివసిస్తున్నారని, ఎంతో మందికి ప్రేరణ గా నిలిచారని , బోర్ నుండి వచ్చే నీటిని RO ప్లాంట్ ( మంచి నీటి శుద్ధి కేంద్రం) ద్వారా మంచి నీటిగా శుద్ధి చేసి కాలనీ అవసరాలకు వాడుకోవడం చాలా ఆభినదించదగ్గ విషయమన్నారు.

శుద్ధి చేసిన బోర్ వాటర్ ను మొక్కలకు, గ్రీనరీ కోసం, ఇతర అవసరాల కోసం వాడుకోవడం అభినందించదగినదన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ కాశింని, కాలనీ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో టీ ఎస్ ఎల్ సంస్థ ప్రతినిధి కాశీ విశ్వనాథం, యూబీడీ డైరెక్టర్ విక్రమ్ చంద్ర, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ మరియు గుల్ మోహర్ కాలనీ ప్రెసిడెంట్ ఖాసీం , జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ రఘు రాము, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ చారి, సభ్యులు పెంటోజి, శేఖర్ రావు, రాణి విక్టోరియా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, కృష్ణ చారి, చలమరెడ్డి , SA అలీఖాన్, షేక్ రాజా,భేరి రాంచందర్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.