నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మియాపూర్ లోని అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ (ఏడిఈ )కి స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం వినతి పత్రం అందించింది. కాలనీలో అక్కడక్కడ 10 ఇంటర్ ఫూల్స్ వేయాలని, రెండవ ట్రాన్స్ ఫార్మర్ నుంచి స్తంభాలకు వేలాడుతున్న కరెంటు వైర్ల స్థానంలో కేబుల్ వైర్ ఏర్పాటు చేయాలని, జిహెచ్ఎంసి ద్వారా ఏర్పాటు చేసిన నీటి వాడుక బోరు పంపు త్రీఫేస్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని, వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాన్ని నివారించాలని కోరుతూ ఏడిఈకి వినతి పత్రం అందించారు సంఘం సభ్యులు. ఈ సందర్భంగా స్టాలినర్ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి నిమ్మక నాగభూషణం మాట్లాడుతూ.. ఈ సమస్యల పై గత పదకొండు నెలలుగా ఏడిఈఏ, ఏఈ లకు రాతపూర్వకంగా విన్నవించుకున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కరించలేదని తెలిపారు.
విద్యుత్ బకాయిల మీద చూపిస్తున్న చొరవ, విద్యుత్ సమస్యను సక్రమం చేయడంలో చూపించాలని, అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే అధికారులు ప్రజలకు తగిన జవాబు చెప్పవలసి ఉంటుందని తెలిపారు. స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి నిమ్మక నాగభూషణంతోపాటు కార్యవర్గ సభ్యులు డి.శ్రీనివాసులు, టీ. నర్సింగ్, కె షరీష్ పాల్గొన్నారు.