- ఎస్ సీఎస్ సీ డిజిఎం మద్దతుతో షీ షటిల్ బస్
- లింగంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్ నుండి విప్రో సర్కిల్ వరకు రాకపోకలు
- సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో బస్ ని ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
నమస్తే శేరిలింగంపల్లి: మహిళా ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎస్ సీఎస్ సీ డిజిఎం మద్దతుతో షీ షటిల్‌ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు లింగంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్ నుండి విప్రో సర్కిల్ వరకు రాకపోకలు సాగించనున్నది. ప్రధానంగా ఐటీ & ఐటిస్ కంపెనీలు & ఐటీ పార్క్ పరిసర ప్రాంత వాసులకు ఈ బస్ సేవలు అందించనున్నది. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో బస్ ని ప్రారంభించగా.. జాయింట్ సిపి అవినాష్ మహంతి, డీసీపీ నారాయణ నాయక్, ఎస్ సి ఎస్ సి సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల పాల్గొన్నారు.