- గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబిర్ చెరువు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చేపడుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చెరువు సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయని, అంబిర్ చెరువు చుట్టుపక్కల ప్రజల విజ్ఞప్తి మేరకు గుర్రపు డెక్క తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం , పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి DGM వేంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి,సూపర్ వైజర్ నరేంద్ర, హైదర్ నగర్ డివిజన్ బీఆర్5 ఎస్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వేణు గోపాల్, నవీన్, సతీష్, శ్రీనివాస్ రాజు, విజయ్, రమేష్, సాయిలు కాలనీ వాసులు పాల్గొన్నారు.