నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి కోర్టుకు అదనంగా మరో ఐదు కోర్టులు (XIV అదనపు జిల్లా కోర్టు, అదనపు సీనియర్ కోర్టు, 3 అదనపు జూనియర్ కోర్టులు) ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుల మంజూరు చేయడం పట్ల కూకట్ పల్లి బార్ అసోియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ద గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కూకట్ పల్లి కోర్టు ఒక్క కోర్టు గా ప్రారంభమై ఈ రోజు 19 కోర్టులతో వట వృక్షంగా ఏదిగిందన్నారు. ఒక్క కోర్టుగా ప్రారంభమై 19 కోర్టుల ప్రాంగణంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో కూకట్ పల్లి కోర్టు తెలంగాణలోనే పెద్ద కోర్టు గా ఆవిర్భవిస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త కోర్టు ప్రాంగణంలో కూకట్పల్లి కోర్టులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు డి. మల్లేష్, ప్రధాన కార్యదర్శి తాండ్ర రమేష్, జాయింట్ సెక్రటరీ హరిశంకర్ రెడ్డి, ట్రేజరర్ డేవిడ్ రాజు, లైబ్రరీ సెక్రటరీ హర్ష వర్ధన్ రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీ మధుసూధన్, లేడీ సెక్రటరీ శ్రీలత, కార్యవర్గ సభ్యులు శివకృష్ణ, జోష్న, శ్వేత,చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, శేకర్ గౌడ్, బాలా పీర్ హర్షం వ్యక్తం చేశారు.