శేరిలింగంపల్లిలో వైభవంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

 • వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర వివక్షపై 15 తీర్మానాలు
 • ఏకగ్రీవంగా ఆమోదం
 • శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలే నా బలగం
 • బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం
 • రూ. 8500 కోట్లతో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి చేశాం
 • భారాస పార్టీ ప్రతినిధుల సభ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఆవిర్భావ దినోత్సవంలో నినాదాలు చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

నమస్తే శేరిలింగంపల్లి: భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ భారాస పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్లు, బీఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు , ప్రజాప్రతినిధులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ కారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ అభిమానులు ,పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులతో కలిసి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ లు పార్టీ జెండాలను ఎగురవేశారు. అంతేకాక అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్ర వివక్ష పై 15 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలోకి చేరేవిదంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని తెలిపారు. ఎనిమిదేళ్ల లో ఏమి చేసామో, రాబోయే రోజులలో ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరించాలని చె ప్పారు.

సభలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
 • ఆమోదం పొందిన తీర్మానాలు
 • వ్యవసాయం.. రైతు సంక్షేమం :
  24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పథకాలు కాళేశ్వరం, తదితర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, పంట కొనుగోలు కేంద్రాలు, ధరణీ, భూముల ధరలు, వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎంకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
 • సామాజిక భద్రత :
  వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, బోదకాలు బాధితులు, డయాలసిస్ రోగులకు పెన్షన్లు..! కల్యాణ లక్ష్మీ.. షాదీ ముబారక్ పథకం..!
 • మహిళా శ్రేయస్సు :
  మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్లు.. షీ టీమ్స్.. కేసీఆర్ కిట్.. న్యూట్రీషన్ కిట్.. అమ్మఒడి వాహనాలు.. ఆరోగ్య మహిళా క్లినిక్లు.. ఒంటరి మహిళలు-వితంతు పెన్షన్లు.. బాలికల గురుకులాలు.. పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. స్థానిక సంస్థల్లో ..మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు.. బతుకమ్మ చీరలు..!
 • బీసీ సంక్షేమం :
  కుల వృత్తులకు పునరుజ్జీవం..! గొర్రెల పంపిణీ.. చేపల పంపిణీ.. చేనేతకు చేయూత.. నేతన్నకు బీమా… సెలూన్లకు ఉచిత కరెంట్.. దోభీఘాట్ల ఆధునీకరణ… తాళ్ల పన్ను రద్దు.. నేత గీత కార్మికులకు పెన్షన్లు..5 లక్షల ప్రమాద బీమా… హైదరాబాద్ లో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు..!
 • దళిత సంక్షేమం :
  దళితబంధు ఒక విప్లవం… కూలీలు యజమానులు..!, మెడికల్.. ఎరువుల షాపులు లైసెన్స్ ఇచ్చే అన్ని వ్యాపారాల్లో రిజర్వేషన్లు..!, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం…సచివాలయానికి అంబేద్కర్ పేరు..!, గృహాలకు కరెంట్ సబ్సిడీ.. ఎస్సీగురుకులాలు.. విదేశీ స్కాలర్ షిప్స్ టీ ప్రైడ్.. సబ్ ప్లాన్..!
 • గిరిజన సంక్షేమం :
  రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంపు..! , పంచాయతీలుగా తండాలు -గూడెంలు.!, త్వరలో పోడు భూములకు పట్టాలు..!, హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసీ భవన్..!!, ఎస్టీ గురుకులాలు, కొండల్లో అడవుల్లో ఆవాసాలకు మిషన్ భగీరథ నీళ్లు..!.
 • విద్యా…ఉద్యోగం
  వెయ్యికి పైగా గురుకులాలతో విద్యా విప్లవం.. ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేల ఖర్చు !, మన ఊరు మన బడితో సర్కారు స్కూళ్లకు సకల వసతులు.!, జిల్లాకో మెడికల్ కాలేజ్ కార్యక్రమం..!, 2లక్షల 25 వేలకు పైగా ప్రభుత్వాల ఉద్యోగాల భర్తీ !, హైదరాబాద్ కు గ్లోబల్ కంపెనీల రాక.. లక్షలాది ఉద్యోగాల సృష్టి..!, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు..!,
 • పల్లె/పట్టణ ప్రగతి
  మెరిసిపోతున్న మన వల్లెలు.!, పక్కాగా రోడ్లు, ఊరికో ట్రాక్టర్ ట్రాలీ.. నర్సరీలు..!, వైకుంఠధామం.. పల్లె ప్రకృతి ధామాలు, క్రీడా కేంద్రాలు… స్వచ్ఛత జాతీయ అవార్డులు..!, మురిసిపోతున్న పట్టణాలు.. పార్కులు.., ట్యాంక్ బండ్లు, ఓపెన్ జిమ్ములు, సెంట్రల్ లైటింగ్, చౌరస్తాల సుందరీకరణ, హైదరాబాద్లో కొత్త పై వోవర్లు.., లింక్ రోడ్లు నాలాల విస్తరణ.. ఎస్టీపీలు..!
అన్నదాన కార్యక్రమంలో భోజనం వడ్డిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
 • మైనార్టీ వెల్ఫేర్ :
  సర్వ మతాలకు సమాదరణ..! మతకల్లోలాలకు తావులేని విధంగా శాంతి భద్రతలు..! రంజాన్ తోఫా, షాదీ ముబారక్.. ఇమామ్లకు వేతనాలు..! ముస్లిం బాలికలకు గురుకులాలు…! భారీగా బడ్జెట్ పెంపు..! అధికారికంగా క్రిస్మస్ వేడుకలు.. క్రిస్టియన్ భవను భూమి కేటాయింపు.!
 • ధరల పెరుగుదల.. మోడీ వైఫల్యం :
  అడ్డూ అదుపూ లేని విధంగా ధరల పెరుగుదల..! మోడీ ప్రభుత్వ విధానాలే కారణం.. ! . సిలిండర్ 400 నుంచి 1200 పెంపు.. పెట్రోల్ 70 నుంచి 115కు పెంపు…! పెట్రోల్ డీజీల్ పై 30 లక్షల కోట్ల సెస్సులు విధించిన కేంద్రం..! ఫలితంగా రవాణా వ్యయం.. ఉత్పత్తి. ఖర్చు పెరిగి పప్పులు.. ఉప్పుల రేట్లు భగ్గుమంటున్నవి..! డీజిల్ ధర పెరగడం వల్ల రైతు ఖర్చులు రెట్టింపయ్యాయి..! విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిబంధనలు పెట్టడం వలన కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయి..!.తెలంగాణ ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను వినియోగ దారులపై వేయకుడా భరిస్తున్నది..! సామాన్యుడి బతకుబండిపై ధరల దాడిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. సిలిండర్ సబ్సిడీ పునరుద్ధరించాలని.. పెట్రోల్ పై సెస్సులు పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ తీర్మానం..! ప్రవేశపెడుతున్నాను .
 • తెలంగాణపై వివక్ష :
  తెలంగాణ పై అడుగడుగున వివక్ష..! తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ. మాటలు..! నిధులు ఇవ్వకుండా.. అప్పులు తెచ్చుకోనివ్వకుండా కక్ష..! మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ పథకాలకు పైసలియ్యలేదు..! కాజిపేట కోచ్ ఫాక్టరీ.. బయ్యారం ఉక్కు..గిరిజన వర్శిటీ.. ప్రాజెక్టులకు జాతీయహోదా ఇతర విభజన హామీలను నెరవేర్చలేదు..!
  157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటీ రాలేదు..! జిల్లాకో నవోదయ ఇవ్వాల్సివున్నా ఇవ్వలేదు..! మోటర్లకు మీటర్లు పెట్టలేదని 30వేల కోట్లు రుణాలు కోత విధించారు..! ఆర్బీఐ దగ్గర రుణాలు తెచ్చుకోకుండా ఆంక్షలు విధించారు..! ఓర్వలేని తనంతో.. కడుపుమంటతో తెలంగాణపై కక్షసాధిస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ తీర్మానం..! ప్రవేశపెడుతున్నాను ..
 • విభజన హామీలు.. కేంద్ర వివక్షలపై జిల్లాల వారీగా ప్రత్యేక తీర్మానాలు! :
  ITIR రద్దు … మెట్రో రెండు దశకు తిరస్కరణ … వరధసాయం చేయకపోవడం..ట్రెడిషనల్ మెడిసన్ సెంటరును గుజరాత్ కు డిఫెన్స్ కారిడార్ ను ఉత్తర ప్రదేశ్ కు తరలించుకుపోవడం.. అభివృద్ధి పనులకు సెంటర్ భూములను ఇవ్వకపోవడం అంశాలపై హైదరాబాద్ సిటీలో తీర్మానాలు..! ప్రవేశపెడుతున్నాను .
 • దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. :
  సీబీఐ.. ఈడీ.. ఐటీ లను బీజేపీ తన అనుబంధ సంఘాలుగా మార్చుకొని దేశంలో ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నది..! 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా తయారైంది.! తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు..! దేశం కోసం బయల్దేరిన బీఆర్ఎస్ పార్టీని ఇక్కడే నిలవరించాలని మన పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తూ లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి..! దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ సర్కారు నిరంకుశ వైఖరిని వ్యతేరేకిస్తూ తీర్మానం..! చేస్తున్నట్లు తెలిపారు.
 • ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం.. అదానీకి అంకితం :
  ఎల్ఐసీ లాంటి నవ రత్నాలను.. మినీ రత్నాలను.. దశాబ్దాల తరబడి పోగేసుకున్న జాతి సంపదను ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మేస్తున్నది..! తన దోస్తులు.. అదానీ.. అంబానీలకు ఎయిర్ పోర్టులు.. బొగ్గు గనులు.. నౌకాశ్రయాలను కారుచౌకగా కట్టబెట్టేస్తున్నడు మోడీ..! ఉద్యోగాలు పోతున్నవి.. రిజర్వేషన్లకు భంగం కలుగుతున్నది..! ప్రభుత్వరంగ సంస్థలను అంగడిలో అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం..
 • ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ :
  మోడీ సర్కారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి.. నిరుద్యోగుల్ని నిండా ముంచింది..! ప్రభుత్వ రంగం సంస్థల్లో ఖాళీగా వున్న 15లక్షల పోస్టులను భర్తీ చేయకుండా ఆపేసింది..! యువతకు ఉద్యోగ కల్పన చేయాలని.. భర్తీ చేయాలని కోరుతూ తీర్మానం..! కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేయాలనీ కోరుతూ తీర్మానం …!
  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షులు, మహిళ నాయకులు , పార్టీ ప్రధాన , అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here