ఏసీబీ వలలో మియాపూర్ ఎస్ఐ యాదగిరి రావు

  • బాధితుల నుండి 50 వేలు డిమాండ్
  • ఎస్ఐ సూచన మేరకు డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ కు వచ్చిన బాధితుల నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. గేమింగ్ యాక్ట్ కింద నమోదైన కేసు విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తాండ్ర అశోక్ గౌడ్, లీలా ప్రభు అనే బాధితుల వద్ద నుండి ఎస్ఐ యాదగిరి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిలు రూ.50 వేల లంచం డిమాండ్ చేయగా, రెండు రోజుల క్రితం బాధితుడు రూ.30 వేలను పోలీసు స్టేషన్ సమీపంలో ఓ ఆటోలో ఉంచగా.. అక్కడి నుండి కానిస్టేబుల్ తీసుకుని ఎస్ఐ యాదగిరికి ఇచ్చారు.

ఏసీబీకి చిక్కిన ఎస్ఐ యాదగిరి రావు

మంగళవారం మరో రూ.20 వేలను బాధితుల నుండి హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు న్యాయం చేయమంటే పోలీసు అధికారులు లంచం కోసం వేధిస్తున్నారని బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అధికారులు వల పన్ని కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎస్ఐ యాదగిరి ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడు నుంచి హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి రూ.20 వేలు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఎస్సై యాదగిరి తీసుకోమంటేనే డబ్బులు తీసుకున్నానని కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ యాదగిరి అందుబాటులో లేరని, ఆయనను విచారించి చర్యలు తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here