- అబద్ధపు, అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్న బీజేపీ
- గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో గాంధీ
- ప్రగతి నివేదిక విడుదల
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేసి ఆదాని, అంబానీ లకు కట్టబెడుతుందని, ఈ మధ్య కొంత మంది పొద్దెరుగని కొత్త బిచ్చగాళ్ల తిరుగుతూ ఇన్ని నిధులు ఖర్చు చేసారా, ఎక్కడ చేశారని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, మేము చేసిన అభివృద్ధి వివరాలు అంకెల తో సహా చెప్పే దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే కాలర్ ఎగురవేసి చెపుతున్నామని దీమా వ్యక్తం చేశారు. అబద్ధపు, అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు ఏమి చేయాలో మాకు తెలుసని, ఇక ముందు కూడా చేస్తామని, ముచ్చటగా మూడోసారి హైట్రిక్ విజయం సాధిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ది అని అన్నారు. క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేలా ప్రతి ఒక్కరు కృషి కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ ప్రగతి నివేదికను ప్రవేశపెట్టారు.
- గచ్చిబౌలి డివిజన్ ప్రగతి నివేదిక (వార్డు నంబర్ 105)
డివిజన్ ఓటర్ల వివరాలు
స్త్రీలు: 26301
పురుషులు: 29817
ఇతరులు: 19
పోలింగ్ కేంద్రాల సంఖ్య: 51
మొత్తం ఓటర్ల సంఖ్య: 56137
అభివృద్ధి పనుల వివరాలు – 94271.57 (942 కోట్ల 71 లక్షల 57 వేల రూపాయలు)
డివిజన్ లో నిధులతో చేసిన అభివృద్ధి పనుల వివరాలు
236 కోట్ల 59 లక్షల రూపాయల GHMC నిధులతో డివిజన్ లోని కాలనీ లలో, బస్తీలలో కల్పించబడిన మౌలిక వసతులు వివరాలు
క్రమ సంఖ్య వర్గం మొత్తం పనులు
సంఖ్య అంచనా వ్యయం
1 బీటీ రోడ్డు 95 5288.00
2 సీసీ రోడ్డు 160 5444.00
3 యూజీడీ 108 2467.00
4 కమ్యూనిటీ హాల్/ వార్డు కార్యాలయం నిర్మాణాలు
15 287.00
5 ఫుట్‌పాత్ 4 343.00
6 మోడల్ కారిడార్ 3 1370.00
7 లేన్ మార్కింగ్స్ 1 20.00
8 డీసిల్టింగ్ 12 152.00
9 కాంపౌండ్ వాల్ 33 1120.00
10 స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ)
88 2738.00
11 ఇతర పనులు (మ్యాన్ హోల్స్ పై కప్పులు, కాలువలు శుభ్రపరుచుట)
254 3189.00
12 శ్మశాన వాటికలు 8 380.00
13 మోడల్ లేక్ 6 456.00
14 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్స్
1 170.00
15 బస్ బే 3 125.00
16 మోడల్ మర్కెట్స్ 3 110.00
మొత్తం 794 23659.00
ST సబ్ ప్లాన్ : (4 కోట్ల రూపాయలు)
ST సబ్ ప్లాన్ ద్వారా గోపనపల్లి , ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాలలో 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ ల నిర్మాణం మరియు 2 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేశారు.
సబ్ – స్టేషన్ : (100 కోట్ల రూపాయలు)
సబ్ – స్టేషన్ ద్వారా TNGO ‘S కాలనీ , గోపనపల్లి, జన చైతన్య , పాలిఫికా, మరియు గచ్చిబౌలి సబ్ – స్టేషన్ 100 కోట్ల నిధులు మంజూరు చేశారు
విద్యుత్ నిర్వహణ:
TSSPDCL – ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కింద 250 కోట్ల (250,00,00,000) రూపాయలు
వీధి దీపాల నిర్వహణ:
వీధి దీపాల నిర్వహణకు 4 కోట్ల 23 లక్షల 26 వేల రూపాయల (4, 23, 26,000) నిధులు వెచ్చించారు.
- మిషన్ భగీరథ :
కొత్తగా దాదాపు 9792 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
డివిజన్ లో ఇప్పటి వరకు దాదాపు 14575 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
హడ్ కో ప్రాజెక్ట్ కింద డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 93 కోట్ల 24 లక్షల రూపాయలతో దాదాపు 49.7 కిలోమీటర్లు కొత్త పైపు లైన్లను వేశారు.
డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 14 కోట్ల 15 లక్షల రూపాయలతో మంచినీటి వసతి కల్పించారు.
డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 36 కోట్ల 82 లక్షల రూపాయలతో యూజీడీ వసతి కల్పించారు.
జర్నలిస్ట్ కాలనీ లో మంచి నీటి సరఫర కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
జర్నలిస్ట్ కాలనీ లో UGD కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
TNGO ‘S కాలనీ లో సెవెరేజ్ పనుల కోసం 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
రోజు విడిచి రోజు ఒక గంట వరకు నీటి సరఫరా జరుగుతున్నది.
ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా జరుగుతుంది.
STP ల నిర్మాణం: (50 కోట్ల రూపాయలు)
నల్లగండ్ల లో 7 MLD సామర్ధ్యం గల STP కొరకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఖాజాగూడ లో 21 MLD సామర్ధ్యం గల STP కొరకు 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
రిజర్వాయర్ల నిర్మాణం :
ఐఐఐటీ (IIIT) వద్ద GLSR కింద 14 కోట్ల 08 లక్షల రూపాయలతో 5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు.
గోపనపల్లి వద్ద GLSR కింద 7 కోట్ల 82 లక్షల రూపాయలతో 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు.
నల్లగండ్ల హుడా వద్ద GLSR కింద 8 కోట్ల 52 లక్షల రూపాయలతో 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు.
సుందరీకరణ పనులను చేపట్టిన చెరువులు
2 కోట్ల 95 లక్షలతో నల్లగండ్ల చెరువు అభివృద్ధి
1 కోటి 60 లక్షల రూపాయలతో మల్కం చెరువు అభివృద్ధి
1 కోటి 11 లక్షల రూపాయలతో మెడ్ల కుంట చెరువు అభివృద్ధి
95 లక్షల రూపాయలతో చిన్నపెద్ద చెరువు అభివృద్ధి
70 లక్షల రూపాయలతో కోమటి కుంట చెరువు అభివృద్ధి
లింక్ రోడ్స్ :
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ప్రత్యామ్న్యాయ రోడ్ల నిర్మాణం.
(85,43,00,000) 85 కోట్ల 43 లక్షల రూపాయలతో అభివృద్ధి:
ఓల్డ్ బొంబాయి హై వే నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ via ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్వరకు 30 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి
ఖాజాగూడ చెరువు నుండి ORR సమాంతరంగా ఉర్దూ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ వరకు 40 కోట్ల 09 లక్షల రూపాయలతో అభివృద్ధి
ఓల్డ్ బొంబాయి హై వే నుండి ఖాజాగూడ రోడ్ via మాల్కం చెరువు రోడ్ , చిత్రపురి కాలనీ వాల్ వరకు 14 కోట్ల 84 లక్షల రూపాయలతో అభివృద్ధి
కంటి వెలుగు :
1. రెండవ విడత కంటి వెలుగు పధకం ద్వారా రెండు సెంటర్ లలో గాను పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరుకు 11501 మంది కంటి పరీక్షలు జరిపి 1248 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణి చేశారు. వైద్యుల సూచనల మేరకు ఇంకా 757 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం
కళ్యాణ లక్ష్మీ – 407
షాదీ ముబారక్ -146
మొత్తం 553 మంది లబ్దిదారులకు (5,20,31,016) 5 కోట్ల 20 లక్షల 31 వేల 16 రూపాయలు ) అందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF/LOC)
లబ్ధిదారుల సంఖ్య – 192 (1, 44, 00, 000) 1 కోటి 44 లక్షల రూపాయలు అందించారు.
పింఛన్లు
వృద్యాప్య పింఛన్లు – 733
వితంతువు పింఛన్లు – 1061
వికలాంగుల పింఛన్లు – 246
ఒంటరి మహిళా పింఛన్లు – 57
మొత్తం పింఛన్లు – 2097
దళిత బంధు :
దళిత బంధు పధకం ధ్వారా దళిత కుటుంబాలకి ఉపాధి అవకాశాల కోసం ఒకొక్కరికి 10 లక్షల చొప్పున పది మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.
CDP ఫండ్స్ :
CDP ఫండ్స్ కింద 1 కోటి 11 లక్ష రూపాయల నిధుల ద్వారా చేపట్టిన పనులు.
డివిజన్ లోని న్యూ PJR నగర్ లో బోర్ వెల్ బోర్ వెల్ కొరకు 2 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఖాజాగూడ వద్ద బోర్ వెల్ కొరకు 2 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరు చేశారు.
గచ్చిబౌలి లోని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాల కొరకు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
రాయి దర్గా లో కమ్యూనిటీ హాల్ లోని ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
లక్ష్మి విహార్ లో కమ్యూనిటీ హాల్ కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
రాయి దర్గా లోని అంబెడ్కర్ కమ్యూనిటీ హాల్ లో ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
నానాక్రంగూడ SC బస్తి లోని కమ్యూనిటీ హాల్ లో అడిషనల్ రూమ్ కొరకు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
గోపనపల్లి లోని డైమండ్ హైట్స్ వద్ద పార్క్ అభివృద్ధి కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
గోపనపల్లి విల్లెజ్ లోని కమ్యూనిటీ హాల్ కోసం 11 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
పంచవతి కాలనీ బ్రిడ్జి మరియు కల్వర్ట్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
నేతాజీ నగర్ లో మహిళా భవన్ కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
DMF ఫండ్స్ :
DMF ఫండ్స్ ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
రాయదుర్గం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో కాంపౌండ్ వాల్ మరియు గ్రౌండ్ లెవెలింగ్ కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
SDF ఫండ్స్ :
SDF ఫండ్స్ ద్వారా 1 కోటి 62 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపించడమైనది.
రాయిదుర్గ SC బస్తి లో సెవెరేజ్ పైప్ లైన్స్ మరియు APHB కాలనీ లో మ్యాన్ హోల్స్ మరమ్మతుల కొరకు 6 లక్షల రూపాయల ప్రతిపాదనలను పంపించారు.
సాయి రామ్ కాలనీ లో సెవెరేజ్ పైప్ లైన్స్ మరియు గోపనపల్లి లో మ్యాన్ హోల్స్ మరమ్మతుల కొరకు 6 లక్షల రూపాయల ప్రతిపాదనలను పంపించారు.
ఎన్టీఆర్ నగర్ మరియు గోపనపల్లి తాండలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం 52 లక్షల రూపాయల ప్రతిపాదనలను పంపించారు.
సోఫా కాలనీ లో UGD లైన్స్ కొరకు 48 లక్షల రూపాయల ప్రతిపాదనలను పంపించారు.
గోపనపల్లి వీకర్ సెక్షన్ కాలనీ మరియు ఖాజాగూడ విల్లెజ్ వీకర్ సెక్షన్ కాలనీ లలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కొరకు 50 లక్షల రూపాయల ప్రతిపాదనలను పంపించారు.
పార్కుల అభివృద్ధి :
పార్కులు – 13
థీమ్ పార్కులు – 03
హుడా లేఔట్ -10 లో ఇల్లుషన్ థీమ్ పార్క్ కొరకు 3 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు .
హుడా లేఔట్ -11 లో ఏకో సెంట్రిక్ థీమ్ పార్క్ కొరకు 3 కోట్ల 75 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు.
TNGO’S కాలనీ లో ఉమెన్స్ థీమ్ పార్క్ కొరకు 3 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు .
బస్తి దవాఖాన:
గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని దర్గా , మధుర నగర్ , గోపన్ పల్లి , గౌలిదొడ్డి లో బస్తి దవాఖాన ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 400 మందికి పైగా బీపీ, షుగర్ మరియు ఇతర రక్త పరీక్షలు లాంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలకు 9 నెలలు నిండే వరుకు వారికి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు.
చంటి పిల్లలకు ప్రతి బుధవారం మరియు శనివారం ఉచితంగా టీకాలు వేస్తున్నారు.
చేపట్టవలసినవి పనులు : వరద నీటి కాలువలు
ఖాజాగూడ లోని సాయి వైభవ్ కాలనీ నుండి పెద్ద చెరువు వరకు
రాయదుర్గం PS నుండి ఓరియన్ విల్లాస్ (బయో డైవర్సిటీ) వరకు
ఖాజాగూడ లోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నుండి ఖాజాగూడ కల్వర్ట్ ఔట్లెట్ వరకు