బీజేపీ సామాన్యుల నడ్డి విరుస్తున్నది: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 • గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మోడీ మాట్లాడుతూ గ్యాస్ ధరను 400 రూపాయల నుండి 200 వరకు తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే 1200 రూపాయలకు పెంచారని, ప్రతి ఒక్కరు జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరవండి ఒక్కొక ఖాతాలో 15,00,000 లక్షలు వేస్తామని అసత్యపు ప్రచారాలు చేసి అధికారంలోకి రాగానే 15 రూపాయాలు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను సముచిత స్థానం కలిపిస్తామని, పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు సిపాయిలుగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షులు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన , అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రగతి నివేదికను ప్రభుత్వ విప్ గాంధీ ప్రవేశపెట్టారు.

గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
 • ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రగతి నివేదిక (వార్డు నంబర్ 124)
   డివిజన్ ఓటర్ల వివరాలు
   స్త్రీలు: 30770
   పురుషులు: 32714
   ఇతరులు: 7
   పోలింగ్ కేంద్రాల సంఖ్య: 58
   మొత్తం ఓటర్ల సంఖ్య: 63491
   అభివృద్ధి పనుల వివరాలు – 20509.55 (205 కోట్ల 9 లక్షల 55 వేల రూపాయల)
   డివిజన్ లో నిధులతో చేసిన అభివృద్ధి పనుల వివరాలు
  100 కోట్ల 27 లక్షల 10 వేల రూపాయల GHMC నిధులతో డివిజన్ లోని కాలనీ లలో, బస్తీలలో కల్పించబడిన మౌలిక వసతులు వివరాలు

క్రమ సంఖ్య               వర్గం               మొత్తం పనులు
సంఖ్య              అంచనా వ్యయం
1 బీటీ రోడ్డు               18                  587.43
2 సీసీ రోడ్డు               161                3179.81
3 యూజీడీ               128                 1983.85
4 కమ్యూనిటీ హాల్/ వార్డు కార్యాలయం నిర్మాణాలు

6                     54.95
5 ఫుట్‌పాత్             1                     49.90
6 కాంపౌండ్ వాల్     2                     12.73
7 స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ)

18                  510.33
8 ఇతర పనులు (మ్యాన్ హోల్స్ ఫై కప్పులు మరియు కాలువలు శుభ్రపరుచుట)

125               2865.10
9 స్మశాన వాటికలు   8                  783.00
మొత్తం                 467              10027.10

 •  విధి దీపాల నిర్వహణ:
   విధి దీపాల నిర్వహణకు 80 లక్షల 21 వేల 644 రూపాయల (80, 21,644) నిధులు.
   విద్యుత్ నిర్వహణ:
   TSSPDCL – ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కింద 2 కోట్ల 9 లక్షల 30 వేల 753 (2,09,30,753) రూపాయలు
   మిషన్ భగీరథ :
   డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కొత్తగా దాదాపు 10200 కనెక్షన్లు.
   3 కోట్ల నిధులతో 32 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు.
   21 కోట్ల 50 లక్షలతో 32 కిలోమీటర్ ల మేర పలు కాలనీ లలో మంచినీటి పైప్ లైన్ల మార్పు కాలుష్యం లేని నీటి సరఫరా.
   6 కోట్ల 50 లక్షలతో 7.5 కిలోమీటర్ల UGD పైప్ లైన్ లను వేశారు.
   డివిజన్ లో 8700 మంచి నీటి సప్లై లైన్ ల కొరకు రిబేట్ రూ : 8 కోట్ల 52 లక్షల రూపాయలతో నిర్మాణాలు.
   రోజు విడిచి రోజు ఒక గంట నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు నీటి సరఫరా.
   ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా.
 •  రిజర్వాయర్ల నిర్మాణం :

 ఆల్విన్ డివిజన్ లో డివిజన్ లో 11 కోట్ల 30 లక్షల రూపాయల నిధులతో రెండు రిజర్వాయర్ల నిర్మాణం.
1. ఆల్విన్ డివిజన్ లో 1000mm DIA ముఖ్యమైన పెద్ద లైన్ ఎల్లమ్మబండ రిజర్వాయర్ నుండి ఈనాడు కాలనీ వరకు గల రిజర్వాయర్ (2 కోట్ల 80 లక్షల రూపాయలు).
2. ఎల్లమ్మబండ లో 6.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ (8 కోట్ల 50 లక్షల రూపాయలు)
 సుందరీకరణ పనులను చేపట్టిన చెరువులు
 2 కోటి 50 లక్షల రూపాయలతో ఎల్లమ్మ చెరువు అభివృద్ధి
 80 లక్షల రూపాయలతో పరికి చెరువు అభివృద్ధి
 ప్రాజెక్ట్స్ పనులు: ( 34 కోట్ల50 లక్షల రూపాయలు )
 ధరణి నగర్ వద్ద నాలా అభివృద్ధి కొరకు 5 కోట్ల75 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 అంబీర్ చెరువు వద్ద నాలా విస్తరణ పనుల కొరకు 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు.
 ఉషముళ్ళపూడి రోడ్ విస్తరణ పనుల కొరకు 4 కోట్ల25 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 ఎల్లమ్మబండ 60 ఫీట్ రోడ్ విస్తరణ పనుల కొరకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు.
 ఆల్విన్ కాలనీ పైప్ లైన్ బ్రిడ్జి పనుల కొరకు 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు మంజూరు.

 కంటి వెలుగు :

1. రెండవ విడత కంటి వెలుగు పధకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు
ఇప్పటి వరుకు 4844 మంది కంటి పరీక్షలు జరిపి 1190 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణి చేశారు. వైద్యుల సూచనల మేరకు ఇంకా 301 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది.

 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం

 కళ్యాణ లక్ష్మీ – 387
 షాదీ ముబారక్ -299
మొత్తం 686 మంది లబ్దిదారులకు (7,65,97,324) 7 కోట్ల 65 లక్షల 97 వేల 324 రూపాయలు ) అందించారు.

సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ బృందం

 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF/LOC)

 లబ్ధిదారుల సంఖ్య – 372 (2,50,10,000)2 కోట్ల 50 లక్షల 10 వేల రూపాయలు అందించారు.

 పింఛన్లు

 వృద్యాప్య పింఛన్లు – 528
 వితంతువు పింఛన్లు – 887
 వికలాంగుల పింఛన్లు – 332
 ఒంటరి మహిళా పింఛన్లు – 49
 మొత్తం పింఛన్లు – 1797

 దళిత బంధు :

 దళిత బంధు పధకం ధ్వారా దళిత కుటుంబాలకి ఉపాధి అవకాశాల కోసం ఒకొక్కరికి 10 లక్షల చొప్పున పది మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల ఆర్ధిక సహాయం.

 CDP ఫండ్స్ :

CDP ఫండ్స్ కింద 64 లక్షల 63 వేల రూపాయల నిధుల ద్వారా చేపట్టిన పనులు.
 డివిజన్ లోని దీన్దయాల్ అసోసియేషన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు 4 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 సుభాష్ చంద్ర బోస్ నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు 3 లక్షల రూపాయల నిధులు మంజూరు
 ధరణి నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు 6 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 వెంకట పాపయ్య నగర్ ఫేస్-2 లో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు 3 లక్షల 63 వేల రూపాయల నిధులు మంజూరు
 నవోదయా కాలనీ లోని కమ్యూనిటీ హాల్ లో ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం 8 లక్షల రూపాయల నిధులు మంజూరు
 Sy .no 336 లోని చర్చి వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 జన్మభూమి కాలనీ లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు.
 సుభాష్ చంద్ర బోస్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 10 లక్షల నిధులు మంజూరు.
 డివిజన్ లోని ZPHS స్కూల్ లో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులు మంజూరు.

 SDF ఫండ్స్ :

1. SDF ఫండ్స్ ద్వారా 50 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను పంపించడమైనది.
 పార్కుల అభివృద్ధి : 03
 బస్తి దవాఖాన:
 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లో ఎన్టీఆర్ నగర్ బస్తి దవాఖాన ఏర్పాటు చేయంచి పేదలకు ప్రతి రోజు 100 మందికి పైగా బీపీ, షుగర్ మరియు ఇతర రక్త పరీక్షలు లాంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
 గర్భిణీ స్త్రీలకు 9 నెలలు నిండే వరుకు వారికి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు.
 చంటి పిల్లలకు ప్రతి బుధవారం మరియు శనివారం ఉచితంగా టీకాలు వేస్తున్నారు.

 చేపట్టవలసిన పనులు :

 వెస్ట్ సాయి నగర్ లో నాలా మీద బాక్స్ కల్వర్ట్ నిర్మాణం
 మహాత్మా గాంధీ నగర్ లో 80 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం
 అన్ని శ్మశాన వాటికలలో సుందరీకరణ పనులు
 పలు కానీలలో ఉన్న పార్కులలో మరియు ఓపెన్ స్పేస్ లో ఓపెన్ జిమ్స్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here