నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని పిజెఆర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి అర్.పి లకు యునైటెడ్ వై ఇండియా నైస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత్ బయేటేక్ సౌజన్యంతో టైఫాయిడ్ వాక్సిన్ వేయించారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలలో రహదారులపై ఉన్న చెత్తను, నిర్మాణ వ్యర్థాలను తొలగించి పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని, వారు బాగుంటేనే కాలనీలు పరిశుభ్రంగా ఉంటాయని, ప్రజలు గమనించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.