- భక్తులతో కిటకిటలాడిన వెంకటేశ్వర ఆలయం
- పూజలు చేసి స్వామివారిని వేడుకున్న భక్తజనం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సప్రవింశ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మేళ తాళాలతో, బాణా సంచాతో పేలుస్తూ స్వామివారికి రథోత్సవం వైభవంగా చేపట్టారు. శుక్రవారం చేపట్టిన పూజల్లో ఉదయం గంటలకు 7:30 నుండి 9:30 వరకు నిత్యోపాసనం, పూర్ణాహుతి, ఉత్సవాన్తన్నపనము, 10 నుండి 11 వరకు పుష్కరిణిలో స్వామివారి చక్రతీర్థస్నానం, ధ్వజావరోహణం, స్వామివారి శేష వస్త్రములు వేలం, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, తీర్థప్రసాదములు, 1 గంటకు అన్నప్రసాద వితరణ, రాత్రి 7 గంటలకు మేళతాళాలతో, బాణా సంచాతో రథోత్సవం,
రాత్రి 9 గంటలకు హుడాకాలనీకి వాసి కె. రవికుమార్ స్వామివారికి హారతి, తీర్థప్రసాదములు , పుష్పాలంకరణ చేయించారు. చందానగర్ ఆలయ ఉపకార్యదర్శి కె. దేవేందర్ రెడ్డి, హండకాలని వాసి ఎన్. గోపాలకృష్ణరావు, మదీనాగూడ వాసి ఆర్. దక్షిణామూర్తి, చందానగర్ వాసులు కె. వెంకటేశ్వరరావు, బి. సుందరరాజు శెట్టి, నల్లగండ్ల వాసి వెంకటసుబ్బారావు స్వామివారికి రథోత్సవం చేయించారు. చందానగర్ వాసులు పి. వెంకట దుర్గా మహేశ్వరరావు, కనకదుర్గల కుమారుడు ఫణీంద్రకుమార్, శ్రీజ అన్నప్రసాద వితరణ చేయించారు. 6 రోజులు బ్రహోత్సవములలో భాగంగా దీక్ష వహించిన రుత్విలకు దీక్షా వస్త్రములు సమర్పించారు.