ఓల్డ్ ఎంఐజి పేజ్ 1 కమ్యూనిటీ హాల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజి పేజ్ 1 కమ్యూనిటీ హాల్ లో అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్ , పల్స్ , కంటి, దంత, పరీక్షలతోపాటు ఈసీజీ మొదలగు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఫయాజ్ ( జనరల్ ఫిజిషన్ ), డాక్టర్ రామ్స్( నేత్ర వైద్యులు ), డాక్టర్ నవీన్ జక్కుల ( డెంటల్ ), వైద్య సేవలు అందించారు.  ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో భాగంగా పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు.  “ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరు నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగా, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు , తృణధాన్యాలు , డ్రై ఫ్రూట్స్  వంటిపౌష్టికాహారం తీసుకొని , ఆరోగ్యంకాపాడుకోవాలని తెలిపారు. సాధ్యమైనంత మేరకు ఆల్కహాల్, పొగాకు , పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు  దూరంగా ఉండి ఆరోగ్యాన్నిపరిరక్షించుకోవాలని తెలిపారు. అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్నిసంరక్షించుకోవాలని, సూచించారు. మన తీసుకొనే ఆహారం సమయ పాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలోముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాజు, రాములు, రాణి యాదవ్, శ్రీదేవి, మున్నీసాబేగం, మణి మాల, రాధ , సునీత, విజయలక్ష్మి, ప్రీతి గౌడ్ , నాగమణి, లక్ష్మీ, జ్యోతి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు, హాస్పిటల్ ప్రతినిధి అజిత్ త్రిపాఠి పాల్గొన్నారు. ఈ శిబిరంలో 100 మందికి వైద్యసేవలు అందించారు.

ఓల్డ్ ఎంఐజి పేజ్ 1 కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here