నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ లోని పిఆర్కె ఆసుపత్రికి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50-60) మృతదేహాన్ని గుర్తించారు. గురువారం రాత్రే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడిలా కనిపిస్తున్నాడు. మృతుడిని గుర్తించిన వారు చందానగర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.