ఘనంగా బిజెపి కార్యాలయ ప్రారంభోత్సవం

  • బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ జన్మదినం
  • శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , డివిజన్ నాయకులు , కార్యకర్తలు
బిజెపి నూతన కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ ఎన్.టి.ఆర్.నగర్ లో రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిలుగా బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రవి కుమార్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , గచ్చిబౌలి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం ఇలాగె ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం పాటుపడాలని, ఎల్లవేళలా ఇలాగే సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓ బి సి ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, సుబ్రమణ్యం, కృష్ణ, బాలకృష్ణ, ప్రభాకర్, శేకర్, రమేష్, రంగస్వామి, విష్ణు, సురేష్, నగేష్, రమణ, శంకర్, మధు, శివ, రమణ,ముర్గా, విజయ్ బాసని,విష్ణు,నగేష్ , వెంకటేష్, సురేష్, సాయి, శ్రీను, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేక్ కట్ చేస్తూ ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here