ప్రతి సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా కృషి చేస్తాం : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి సమస్యను ప్రణాళికా బద్దంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్, నడిగడ్డ తాండా వాసుల కోరిక మేరకు సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించారు.

నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

కొన్ని రోజుల క్రితం మియాపూర్ డివిజన్, నడిగడ్డ తాండా వాసులు బోర్ సౌకర్యం లేదని , పూర్తిగా పాడైపోయి నీళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలపగా.. తక్షణమే స్పందించి సొంత నిధులతో పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసి నేడు బోర్ కు మరమ్మతులు చేయించి , టాంక్ ను ఏర్పాటు చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రజా సమస్యలను , ప్రజల కోసం పని చేసింది పిజేఆర్, బిక్షపతి యాదవ్ మాత్రమేనన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో సీతారాం నాయక్, రెడీయ్యా నాయక్, చందు యాదవ్, పిన్నం రాఘవేంద్ర, మోహన్, మధు, ఆంజనేయులు, రత్నకుమార్ , ఖలీమ్, రవి, హరి లాల్, సంతోష్, శ్రీహరి, గోపాల్, సందీప్ , సునీత భాయ్, చోటి భాయ్, బుజ్జి భాయ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, పాపయ్య ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here