- మియాపూర్ లో క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎఎస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మియాపూర్ వీడియో కాలనీలో తన క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు మల్లిఖార్జున్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. తనకు సమాజంలో పేరు, మంచి గుర్తింపు ఇచ్చిన శేరిలింగంపల్లి నియోజకవర్గ రుణం తీర్చుకునేందుకు తానెప్పుడూ ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో స్థానికంగా క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గత ఎనిమిది ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్నానని, సీఎం కేసీఆర్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ఎల్లవేళలా పాటుపడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేశానని, ఇన్నాళ్లకు తనకు శేరిలింగంపల్లి రుణం తీర్చుకునే అవకాశం వస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ముందుకు పోతామని, ఉద్యమకారులను, పార్టీ సీనియర్లను, ప్రతీ కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని, ఎక్కడ ఎవరూ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తామన్నారు. అధిష్టానం ఏం చేయమంటే అది చేస్తానని, అధిష్టానం ఆదేశాలను తూచతప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు బండి రమేష్. తాను క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ కార్యకర్తకు, ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు బండి రమేష్. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా, చందానగర్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, బీఆర్ ఎస్ నాయకులు వాలా హరీష్ రావు, కొమరగొని సురేష్ గౌడ్, మిరియాల రాఘవరావు, కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, సంగారెడ్డి, నజీర్ ఖాన్, మల్లేష్, ఇతర బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.