బహుజన రాజ్యాధికారం సాధించాలి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ప్రకటించి బిసి ని ముఖ్యమంత్రి చేయాలని యంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి తెలంగాణలో రాజకీయ పార్టీలకు పిలుపు నిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, రానున్న ఎన్నికల్లో బహుజన వామపక్షాల పాత్ర అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో గాదగోని రవి మాట్లాడారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బియల్ యప్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూటికి 95 శాతం బహుజనులే ఉన్నారని 5 శాతం ఉన్న అగ్రవర్ణ ఆదిపత్య దోపిడీ వర్గాలు రాజ్యాధికారం అనుభవిస్తూ రాష్ట్ర సంపదను యదేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రొఫెసర్ అ తిరుమలి, ప్రొఫెసర్ వీరాస్వామి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్, దండి వెంకట్, పర్వతాలు, బి యల్ యప్ రాష్ట్ర నాయకులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, సిరిగాని సిద్దిరాములు, వసుకుల మట్టయ్య, పోతుంటాయి కాశీ, పల్లె మురళి, వి. తుకారాం నాయక్, లక్ష్మణ్ భారత ముక్తి పార్టీ, రాయబండి పాండురంగాచారి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నుంచి కామేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here