నమస్తే తెలంగాణ: యువ నాయకులు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి సూచించారు. రంగారెడ్డి అర్భన్ జిల్లా బిజెవైఎం కార్యదర్శిగా కుమార సాగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌గా అమర్నాథ్ యాదవ్‌లు నియమితులైన నేపథ్యంలో గురువారం కసిరెడ్డి భాస్కర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ బిజెపి దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ అని, అలాంటి పార్టీ కోసం పని చేయడం అదృష్టంగా బావించాలని అన్నారు. పదవులు శాశ్వతం కాదని పార్టీయే శాశ్వతమని, అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.