బిఆర్ఎస్ పై ప్రజల్లో నమ్మకం లేదు: గజ్జల యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి శూన్యమని గజ్జల యోగానంద్ ఆరోపించారు. శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ వద్ద డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ చేపట్టిన ప్రజా సమస్యల పై పాదయాత్ర పాల్గొని .. ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలను , కర్షక కార్మికుల కష్టాలను, చిరు వ్యాపారుల బాధలను, తెలుసుకున్నారు. ఈ సందర్బంగా యోగానంద్ మాట్లాడుతూ . అబద్ధపు హామీలకు బ్రాండ్ అంబాసిడర్ గా బి ఆర్ ఎస్ ప్రభుత్వం మారిందని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ భూ కబ్జాలతో కోట్లకు కోట్లు దోచుకుంటున్నారని అన్నారు.

పాపిరెడ్డి కాలనీ లో పాదయాత్ర చేస్తున్న గజ్జల యోగానంద్

సాయంత్రం 6 దాటితే ఇంటి నుండి బయటికి అడుగు వేసే పరిస్థితి లేదని, సిసిటివి కెమెరాలు లేవని పలుమార్లు అధికారులకు వినతి చేసుకున్న పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఎస్.సి మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, శేరిలింగంపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కురుమ, శేరిలింగంపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు బాలరాజు, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు దయాకర్, మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు రత్న కుమార్, మియాపూర్ డివిజన్ బీ.జే.వై.ఎం అధ్యక్షులు సిద్దు, శేరిలింగంపల్లి డివిజన్ బీ.జే.వై.ఎం ప్రధాన కార్యదర్శి బొట్టు కిరణ్, బీ.జే.వై.ఎం నాయకులు రామ కృష్ణ, మహిళ మోర్చ నాయకులు గాయత్రి వి, జీ సుధా, కల్పన దేవి, ఎస్ జ్యోతి, లలిత, భార్గవ్ రామ్, మురళి, వి రమేష్, ఎ కళ్యాణ్, శివ చారీ, ఫిరోజ్, రాములు, శ్రీనివాస్, శ్రీకాంత్, ఈశ్వర్, పర్శురాం, పవన్, దుర్గా, మహేష్, సంతోష్, ఆకాష్ మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here