ఆనవాయితీగా దత్తత.. అభివృద్ధి శూన్యం: బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ ఎస్ నాయకులకు దత్తత తీసుకోవడం వాటిని గాలికి వదిలేయడం షరా మామూలే నని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. 37వ రోజు గడప గడపకు బిజెపి ప్రజా గోస రవన్న భరోసా కార్యక్రమం లో భాగంగా హైదర్ నగర్ రామ్ నరేష్ నగర్ లో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరిష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జానకి రామారావు, సీనియర్ నాయకులు చారి, అరుణ్ కుమార్, నవీన్ గౌడ్, వేణుగోపాల్ యాదవ్ రాజారెడ్డి, సునీల్ రెడ్డి, రామరాజు, భద్ర, సీతారామరాజు తో కలిసి గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేపట్టారు.

గడప గడపకు బిజెపి ప్రజా గోస రవన్న భరోసా కార్యక్రమం లో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ హైదర్ నగర్ డివిజన్ ను మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికలలో దత్తత తీసుకున్నారు కానీ అభివృద్ధి చేయలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న ఆలీ -తలాబ్ చెరువును సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు మంజూరు అయిన అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదో స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంబదాస్, శ్రీహరి ,మాధవరెడ్డి, ప్రభాకర్ శర్మ ,రవీందర్ రెడ్డి లక్ష్మణ్, శ్రీనివాసు, మురళి ,చందు, రాములు గౌడ్, శ్రీనివాస్ ,బాలు, బాలాజీ, రమణారావు ,శ్రీరామచంద్రమూర్తి, సోమేశ్వరరావు, కృష్ణారెడ్డి, వీరయ్య, వీరయ్య చారి, వీరు యాదవ్, కృష్ణ ,సాయి, బాలయ్య మొదలగు వారు పాల్గొన్నారు.


పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here