ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం నూతన కార్యాలయం : బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

  • ఘనంగా బిజెపి కార్యాలయ ప్రారంభోత్సవం
  • హైదర్ నగర్ , ఆల్విన్ కాలనీ , వివేకానంద నగర్, కూకట్ పల్లి డివిజన్లకు కలిపి ఏర్పాటు
బిజెపి కార్యాలయానికి రిబ్బన్ కటింగ్ చేస్తున్న చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, భిక్షపతి యాదవ్ , రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: నూతనంగా హైదర్ నగర్ , ఆల్విన్ కాలనీ , వివేకానంద నగర్, కూకట్పల్లి నాలుగు డివిజన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయం రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కోసం నాయకుడి కోసం బడుగు బలహీన వర్గాల.. అభ్యున్నతి కోసం నూతన కార్యాలయం ఏర్పాటు చేశామని, రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు.

బిజెపి జెండాను ఆవిష్కరిస్తున్న చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి

భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు జరిగిన అభివృద్ధి ఉన్నది గాని… ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దాచుకోవడం, దోచుకోవడం తప్ప.. కెసిఆర్ ఇంతకన్నా చేసింది ఏమీ లేదని.. ఇతర ప్రాంతం వాళ్లు తప్పు చేస్తే.. ఇక్కడి నుంచి వెళ్లగొట్టామన్న కేసీఆర్ కు.. లక్షల కోట్లు మింగిన కెసిఆర్ ను ఈ ప్రాంతం వారే బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
బిజెపి పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సౌలభ్యం కోసం ఇంత మంచి కార్యాలయాన్ని ప్రారంభించినందుకు రవికుమార్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, నర్సింగరావు, కమలాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్రావు, నర్సింగ్ యాదవ్, చారి, సీతారామరాజు, నాగులు గౌడ్, రామరాజు, కుమార్ యాదవ్, దేవి రెడ్డి జ్యోతి, శ్రీలత , నవత రెడ్డి పాల్గొన్నారు.

నూతన బిజెపి కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here