- – బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలపై మోపుతున్న విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం మియాపూర్ వద్ద బిఎల్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీఈ సెక్షన్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు వనం సుధాకర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో కేంద్రం లోని బిజెపి పార్టీతో కుమ్మక్కైన టిఆర్ఎస్ పార్టీ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ అనేక పన్నుల పేరుతో జిఎస్టి ని సమర్థించి ప్రజల పైన ఆర్థిక భారాలు మోపుతూ వస్తుందని ఆరోపించారు.
దేశంలో నిరంతరం విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గొప్ప పేరు చెప్పుతూ ప్రజల పైన విద్యుత్ చార్జీల భారాన్ని మోపడం గత టిడిపి ప్రభుత్వం మాదిరిని తెలంగాణలో టిఆర్ఎస్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. బిఎల్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనింగ్ కమిటీ సభ్యుడు ఇ. దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకురాలు కుంభం సుకన్య, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ వి.తుకారం నాయక్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వినింగ్ కమిటీ సభ్యురాలు బి.విమల, జి.లావణ్య, నాయకులు టి. అనిల్ కుమార్, పి.భాగ్యమ్మ, ఎల్.రాజు, కన్నశ్రీనివాస్, ఇసాక్, ఎం. రాణి, ధారలక్ష్మి, టి. పుష్పలత, ఎం.చందర్, కే.చొక్కం, బి. శ్రీలత, దేవేందర్, జంగయ్య, ఎల్లయ్య, నాగేష్, సుమలత, దుర్గ భవాని, కే లక్ష్మి పాల్గొన్నారు.