ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • చేతగాని ఎమ్మెల్యే శేరిలింగంపల్లికి అవసరమా అని నిలదీత
  • ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి
  • అరెస్టు చేసిన పోలీసులు
  • వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తల ధర్నా

నమస్తే శేరిలింగంపల్లి: చేతగాని ఎమ్మెల్యే శేరిలింగంపల్లికి అవసరం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీలు, చెప్పిన మాయ మాటలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మియాపూర్ లో ఎమ్మెల్యే కార్యాలయమును ముట్టడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా యువ మోర్చా ఎస్సీ ఎస్టీ మోర్చా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ప్రజల గోస, వారు పడుతున్న బాధలను రోజు పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఎమ్మెల్యే మనకు అవసరమా అని నిలదీశారు. తక్షణమే ఇచ్చిన హామీలను డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, కొత్త రేషన్ కార్డ్స్, కొత్త పెన్షన్స్, ప్రభుత్వ భూములను రక్షించాలని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. చేతగాని ఎమ్మెల్యే నియంతృత్వ పాలన అంతమొందించే వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే, మినిస్టర్ల ను బయట తిరుగుకుండా ఎక్కడకక్కడ అడ్డుకుంటామని తెలిపారు.

వెంటనే ఇచ్చిన హామీలన్నిటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ రెడ్డి, వినోద రావు, నవతారెడ్డి, రాధాకృష్ణ యాదవ్ ఎల్లేష్, ఆంజనేయులు సాగర్, మాణిక్ రావు, గణేష్, లక్ష్మణ్, శ్రీశైలం, పద్మ, నర్సింగ్ రావు, భాస్కర్ రెడ్డి, మలాకర్ రెడ్డి రామరాజు మొదలగువారు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here