- రూ. 1 కోటి 50 లక్షలు పొందిన ఘనుడు
- 2016లో బాగ్ అమీర్ స్మశానవాటిక స్థలం ఆక్రమన
- లోకాయుక్తకు స్థానికుల ఫిర్యాదు.. కేసు నమోదు
- విచారణ జరిపి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన స్థానిక ఎమ్మార్మో
- నకిలీ దస్తావేజులతో 2023, ఏప్రిల్ 4న రుణం కోసం దరఖాస్తు
- రూ. 1కోటి 50 మంజూరు చేసిన ది సిటిజన్ కో ఆప్ సొసైటీ లిమిటెడ్
- రుణాన్ని రికవరీ చేసి.. జగదీశ్ పై చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వానికి, సంబంధిత బ్యాంకు యాజమాన్యానికి స్థానికుల ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి : స్థలాన్ని ఆక్రమించాడని కేసు వేసినా.. నకిలీ దస్తావేజులు సృష్టించి వ్యక్తి రుణం పొందడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగ్ అమీర్ స్మశానవాటిక స్థలాన్ని బి జగదీష్ అనే వ్యక్తి ఆక్రమించాడు. దీనిపై స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. కేసు నెంబర్ 4884/16/B1లో స్థానిక ఎమ్మార్వో విచారణ కూడా జరిపించారు. Lr.No.D/1358/2016ను 2016వ సంవత్సరం అక్టోబర్ 22 ప్రకారం.. Lr.No.D/1358/2016 2020వ సంవత్సరం ఏప్రిల్ 22 ప్రకారం సదరు స్థలం ఆక్రమించినట్లు నిర్ధారించారు. కానీ జగదీష్ నకిలీ (దస్తావేజు నెంబర్ 2710/2023) దస్తావేజులతో ది సిటిజన్ కో ఆప్ సొసైటీ లిమిటెడ్ కి రుణం కోసం 2023 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన దరఖాస్తు చేసుకోగా.. రూ. 1 కోటి 50 లక్షలు మంజూరయ్యాయి. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. జగదీష్ కి మంజూరైన రూ. కోటి యాభై లక్షల రుణాన్ని రికవరీ చేసి అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సదరు బ్యాంక్ యాజమాన్యాన్ని కోరుతున్నారు. అందుకు సంబంధించి వినతిపత్రం కూడా అందించారు.