- మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హఫీజ్పేట్ డివిజన్ యువజన అధ్యక్షుడు రోహిత్, శివ తదితరులు
నమస్తే శేరిలింగంపల్లి : బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాంధీ గెలుపునకు తన డివిజన్ లో అత్యధికంగా ఓట్లు వచ్చేలా హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడి కృషి పట్ల బీఆర్ఎస్ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నది. గాంధీ విజయంలో గౌతమ్ గౌడ్ తో పాటు దాత్రినాథ్ గౌడ్ ముఖ్య పాత్రవహించినందుకు అభినందనలు వెల్లువెత్తాయి.
ఇందులో భాగంగా వారిని హఫీజ్పేట్ డివిజన్ యువజన అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్, బిఆర్ఎస్ యూత్ నాయకుడు శివ ముదిరాజ్, శ్రీను తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి అభినందించారు.