సంక్షేమ పథకాలు ప్రజల దారికి చేర్చాలి : కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

  • బిజెపి గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో
    నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి గౌలిదొడ్డిలోని కార్పొరేటర్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. రాబోయే 15 రోజుల్లో చేపట్టే కార్యక్రమ విధానాల గురించి నాయకులు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 12న హైదరాబాద్ కు రానున్న సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ నుండి అధిక సంఖ్యలో బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ ఎస్ సీ మోర్చా అధ్యక్షుడు, సంజీవ, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షుడు హరీష్ శంకర్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, ఆర్ వెంకటేష్, తిరుపతి, దయాకర్, ఇందిరా, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షుడు బి విటల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, అంబటి అశోక్, అనిల్, వరలక్ష్మి, దినేష్ యాదవ్, శంఖేష్ సింగ్, దేవేరుకోండ గోపాల్, గోపాల్, అరవింద్ సింగ్, విజయ్, గంగాధర్, రాజు, శ్రీను, యాదయ్య, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బిజెపి గచ్చిబౌలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో డివిషన్లో చేపట్టే కార్యక్రమాలనుద్దేశించి మాట్లాడుతున్న కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here