నమస్తే శేరిలింగంపల్లి : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప పాప రెడ్డి నగర్ కూరగాయల మార్కెట్లో పర్యావరణ పరిరక్షణకు జ్యూట్ సంచులు వాడుకలోకి తీసుకురావాలని సదుద్దేశంతో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ ఈశ్వర్ రెడ్డి సూచన మేరకు ఆడపడుచులకు, వీధి వ్యాపారులకు వాటిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రమేష్, నరసింహ, శ్రీనివాస్, నర్సింగ్ యాదవ్, సుశీల, జ్యోతి, మీనా, కోటి, మొదలగు పాల్గొన్నారు.