మతోన్మాదం- ఫాసిజం పై పోరాటమే కామ్రేడ్ తాండ్ర కుమార్ కి నివాళి

  • యంసీపీఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయాల అశోక్ ఓంకార్

నమస్తే శేరిలింగంపల్లి : అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద స్మారక స్తూపం నుంచి ఎం.ఏ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ” కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు నిరసనగా రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు యంసీపీఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయాల అశోక్ ఓంకార్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత దేశంలో మతం మైలేజిని పొందటమే బిజేపి నైజమన్నారు. పది సంవత్సరాల మతపాలనాతో దేశాన్ని మతోన్మాద ఫాసిస్టు విధానాలను పెంచిపోషించిందని అన్నారు.

అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా హాజరైన యంసీపీఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయాల అశోక్ ఓంకార్

ప్రస్తుత రాబోయే ఎన్నికలలో మతం మైలేజీని పొందటానికి అనేక జిత్తులమారి మత ఆర్థిక విధానాలను ప్రజల పైన మోపుతుందని అన్నారు. దేశంలో మైనార్టీ వర్గాలకు ప్రజలకు రక్షణ లేదని, అది బిజెపి ప్రభుత్వం తోనే స్పష్టత అయిందని, బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగ ధర్మాలను రాజ్యాంగ వ్యవస్థను కొల్లగొట్టి ఆ స్థానంలో మనుధర్మ విధానాన్ని బలపరుస్తుందని ఆరోపించారు. మతం మైలేజీని పొందడానికి ఎత్తులు చిత్తులు వేస్తున్న బిజెపికి తగిన గుణపాఠం చెప్పడమే కామ్రేడ్ తాండ్ర కుమార్ కి ఘనమైన నివాళులని అన్నారు. యం సి పి ఐ యు పొలిట్ బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం మాట్లాడుతూ.. కామ్రేడ్ తాండ్ర కుమార్ కబ్జాదారులకు దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడారని వాటి బలంగానే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పేదలకు అనేక ఇళ్ల స్థలాలు దక్కాయన్నారు. ఆ పోరాటంలో కామ్రేడ్ తాండ్ర కుమార్ పై అనేక అక్రమ కేసులు దాడులు ప్రభుత్వ ధమనకాండ కొనసాగినా.. ఏనాడు వెనకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు.

మరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ర్యాలీ

ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ గత ప్రభుత్వాల లెక్కల గారడి ఎలా ఉందో అలాగే ఉందని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు కోసం సాధ్యం కానీ హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయకూడదని తెలియజేశారు. కామ్రేడ్ తాండ్ర కుమార్ ద్వితీయ వర్ధంతి నేడు మతాన్ని పాసింజర్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తుల్లో వామపక్ష సామాజిక శక్తులు ఐక్యతతో మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేశారు. మియాపూర్ క్రాస్ రోడ్డు వద్ద గల తాండ్ర కుమార్ గారి స్మారక స్తూపం వద్ద పార్టీ జెండాను కామ్రేడ్ కాటం నాగభూషణం చిత్రపటానికి శావణ పూడి నాగరాజు పూలదండ వేశారు.

మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద స్మారక స్తూపం వద్ద నివాళి

గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు శ్రావణపుడి నాగరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ వసు కుల మట్టయ్య గోని కుమారస్వామి పెద్దారపు రమేష్ మంద రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేష్, యస్ కే మాసం టి. అనిల్ కుమార్ పి. భాగ్యమ్మ, తాండ్ర కళావతి, పల్లె మురళి, కర్రల శ్రీనివాస్, జబ్బర్ నాయక్, కుసుంబా బాబురావు, పోతుగంటి కాశి, వస్కుల సైదుక్క, వంగల రాగ సుధా, సావిత్రి గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కర్ర దానయ్య, ఈ దశరథ్ నాయక్, యార్లగడ్డ రాంబాబు, ఎన్. గణేష్, డి.మధుసూదన్, బి. విమల, దేవనూరు లక్ష్మి, లక్ష్మణ్, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు దేవనూరి నరసింహ, గుడా లావణ్య, ధారా లక్ష్మి, జి శివాని, సుల్తానా బేగం, భూసాని రవి, డి. చందర్, ఎన్. నాగభూషణం, కొడిపాక రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here