బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

  • బిజెపి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
బిజెపి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ , గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్, గోపనపల్లీ తాండలో హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి , రాధాకృష్ణ యాదవ్ తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గోపనపల్లి తాండవాసులకు అందుబాటులో ఉండేలా కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయమన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని కొనియాడారు. బి.ఆర్.ఎస్ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, వారి అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్లి అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, లక్ష్మి నాయక్, రంగస్వామి, జగదీష్, రమేష్, శ్రీరామ్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, బాబు నాయక్, మహిళా నాయకులు మహేశ్వరి, ఇందిర, సుజాత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here