నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామం, కళింగ స్వరాజ్ విమెన్ వింగ్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో “ఒడిశా ఫుడ్ & క్రాఫ్ట్ ఫెస్టివల్ ” శిల్పారామం మాదాపూర్ ఆవరణ లో నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం ఉపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రజలు కలిసి జరుపుకుంటున్న పండుగ “ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్”.
రెండు రోజుల జరగనున్న ఫెస్టివల్ లో బెల్ మెటల్, పటచిత్ర సారీస్, సంబల్పూరి ఇక్కత్, కోటపాడు సారీ, పిపీలి, సంబల్పూరి పట్టు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ , దుపట్టాలు కొలువు దీరాయి. అంతేకాక ఒరిస్సా రాష్ట్రం నుండి చేనేత కళాకారులు విచ్చేయగా.. బరంపురి పచ్చడి, కోరాపుట్ మిల్లెట్ టీ, సుజి కాకర, చెన్నపడో, ఆలూ ధామ్, ధరి బరబరా , మొదలైన ఒరియా ఫుడ్ స్టాల్స్ , జగన్నాథ్ భజన, ఒడిసి డాన్స్, సంబల్పూరి ఫోక్ డాన్స్, ఒడిశా ట్రైబల్ నృత్యాలు, పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.