- భారీ బహిరంగ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు భిక్షపతియాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: గడప గడపకు బిజెపి రవన్న పాదయాత్రలో భాగంగా ఫ్రెండ్స్ కాలనీ, అర్జున్ రెడ్డి నగర్, శిల్ప ఎంక్లేవ్ కాలనీలలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులతో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు భిక్షపతియాదవ్ పాల్గొని ఆనంతరం మాట్లాడారు. బిఆర్ఎస్ కి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపనున్నారని తెలిపారు.
అత్యధిక జనాభా కలిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం కట్టిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు గోరంత.. ప్రభుత్వం చెప్పుకునేది కొండంత అన్నారు. ప్రభుత్వానికి అధికంగా పన్నులు కడుతున్న నియోజకవర్గానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఏ మూలకు సరిపోదని, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి రోజుకొక గాలి మాటలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతారెడ్డి, సింధు రెడ్డి, రామ్ రెడ్డి. ఎల్లేష్, గంగాధర్ రెడ్డి, రాకేష్ దోబే, శ్రీనివాస్ పాల్గొన్నారు.