- హాజరైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లో బిజెపి పార్టీ భారీ బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. అలిగిరి అర్జున్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ, బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు భిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ హాజరై మాట్లాడారు. అధికారులను వేసుకువచ్చి హడావుడి చేసే ప్రభుత్వాన్ని గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను పరిష్కరించటంలో చిత్తశుద్ధి లేని బిఆర్ ఎస్ ను ఇంటికి పంపిద్దామని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడిందని, రాజకీయాలంటే కేవలం కబ్జాలు, డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యంగా ఎంచుకున్న ఈ ప్రజాప్రతినిధులు ఉన్నంతవరకు ప్రజలకు న్యాయం జరగదని భిక్షపతి యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి, సింధు రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, గంగాధర్ రెడ్డి, ఎల్లేష్, విజయ్, నవీన్, వసంత్, జాన్ వెస్లీ, అఖిల్, హరీష్, శామ్యూల్ పాల్గొన్నారు.