నమస్తే శేరిలింగంపల్లి: పేదల ఆకలి తీర్చడానికి సంచార వాహనం ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇస్కాన్ సంస్థ మియాపూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం వాహనాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. వివేకానందనగర్ కాలనీలో తన నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి అన్నప్రసాదాలు వడ్డించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇస్కాన్ మియాపూర్ ప్రతినిధులు పెద్ద మనస్సుతో గొప్ప నిర్ణయం తీసుకున్నారని, ప్రతిరోజు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. పేదవాడి ఆకలి తీర్చే అక్షయ పాత్ర సంచార వాహనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గోపారాజు, బాబ్జి, రోజా, జోగిపేట బాలరాజు, రాంచందర్ పాల్గొన్నారు.