- రూ. 99 లక్షలు స్వాధీనం చేసుకున్న చందానగర్ పోలీసులు & ఎస్ వో టి మాదాపూర్ జోన్ బృందం
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ పోలీసులు & ఎస్ వో టి మాదాపూర్ జోన్ బృందం తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది.
ఓ వ్యక్తి భారీగా నగదు టీసుకెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ మెయిన్ రోడ్ జాకీ ఎదురుగా, షోరూమ్ వద్ద తనిఖీలు చేపట్టగా.. హఫీజ్‌పేట్ లోని మార్తాండనగర్ లో ఉండే వైదల నాగరాజు (33) వద్ద రూ.99 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అతని వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించి నగదు తీసుకెళ్లాలని సూచించారు.