- సామాజిక సేవలో ఎల్లప్పుడూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ముందుంటారు
- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చ్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ని కలిసి ప్రభుత్వం తరపున సంఘానికి భవన నిర్మాణానికి స్థలం కోసం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భూమి ఎక్కడైనా ఉంటే పరిశీలించి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని, తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని వివరించారు.
పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ , విదేశాల్లో చదువుకు రూ. 20 లక్షల అందిస్తోందని గుర్తుచేశారు. సమాజం కోసం, సామాజిక సేవలో ఎల్లప్పుడూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ముందుంటారని కొనియాడారు. అనంతరం సంఘం నాయకులు జగదీశ్వర్ గౌడ్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గుప్త, బచ్చు రాజు, వెంకటేష్ గుప్త, సందీప్, విష్ణు, ప్రభాకర్, వజ్ర లింగ గుప్త, పరమేష్ గుప్త, సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్త, ప్రవీణ్ గుప్త, అశోక్ గుప్త, శ్రీధర్ బాబు గుప్త పాల్గొన్నారు.