నమస్తే శేరిలింగంపల్లి: జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీ శేరిలింగంపల్లి బిసి జన జాగరణ ఐక్యవేదిక చైర్మన్ భేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న బీసీలకు ఇంకా రాజ్యాధికారం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలు బీసీలందరినీ విడదీసి జెండా మోసి, బానిసలుగా వాడుకొని రాజ్యమేలుతున్నారని, బీసీలందరం ఏకమై ఐకమత్యంతో ఓట్లు తమకు వేసుకొని రాజ్యాధికారం పొందాలని పిలుపునిచ్చారు.
బీసీ జన జాగరణ ఐక్యవేదిక ఈ కార్యక్రమంలో మేదరి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కొం టు ముకుందం, మున్నూరు కాపు సంఘం నాయకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ, గౌడ సంఘం నాయకులు ప్రవీణ్ గౌడ్, చాత్తదా శ్రీ వైష్ణవ సంఘం సభ్యులు పట్లూరి కృష్ణమోహన్, మేదరి సంఘం యువ నాయకుడు కొంటు సుమన్, మియాపూర్ బీసీ సంఘం అధ్యక్షుడు నరసింహ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, వడ్డెర సంఘం నాయకులు లక్ష్మణ్, ముదిరాజ్ సంఘం నాయకులు నాగరాజు ముదిరాజ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.