నమస్తే శేరిలింగంపల్లి: ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని కెనరీ ద స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ జీవితంలో ‘మానసిక ఆరోగ్యం’ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
చిన్న పిల్లలు నిర్వహించిన ఉదయం అసెంబ్లీ వారి సొంత మాటలలో విభిన్న భావోద్వేగాలను పలికించింది. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్క్కో వర్క్‌షాప్ సెషన్ నిర్వహించగా… భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు. పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా పాల్గొని మానసిక ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాలు, ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలిపారు.