
సంగారెడ్డి (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంగారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఊరేళ్ళ మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మన దేశంలో ఉన్న జనాభాలో 76 శాతం మంది బి.సిలు ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో ఉన్న వర్గానికి కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే కల్పించడం బాధాకరమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీసీల జనాభతో పోలిస్తే కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఊరేళ్ళ మహేష్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
