మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీకాంత్‌కు ఆర్బీఆర్ టవర్స్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉప్పలపాటి శ్రీకాంత్‌ను కలిసిన వారు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఆర్ టవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ గౌడ్, సెక్రటరీ వాసు, రామకృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, మురళి నాయక్, సురేష్, రమణ, మహాదేవ్ పాల్గొన్నారు.

