చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): విధి నిర్వహణ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని కైలాష్‌నగర్‌లో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి కె.కృష్ణ వద్ద అతని బావమరిది పి.సీతారాం (23) ఉంటూ బాచుపల్లిలోని హోండా షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 11వ తేదీన ఉదయం 9.30 గంటలకు యథావిధిగా సీతారాం విధి నిర్వహణ నిమిత్తం ఇంటి నుంచి బయటకు తన హోండా యాక్టివా వాహనం (టీఎస్15ఎఫ్ఏ6033)పై వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని బావ కె.కృష్ణ అతని ఆచూకీ కోసం అన్ని చోట్లా గాలించాడు. అయినా ఫలితం లేదు. దీంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
