అనాథ పిల్లలకు బట్టలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని సీ. సీ. ఎం సంకల్ప ఫౌండేషన్ అనాథాశ్రమం పిల్లలకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బట్టలు పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలని, వారి బంగారు భవిషత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దామని, బాలల శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణాను దేశానికీ ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమణ కుమారి, రాధిక, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, సునీత, శరణ్య పాల్గొన్నారు.

సీ. సీ. ఎం సంకల్ప ఫౌండేషన్ అనాథాశ్రమం పిల్లలకు బట్టలు పంపిణి చేస్తున్న బొబ్బ చారిటబుల్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here